నాలుగు రోజుల్లో 'కార్తికేయ 2' రాబట్టిన వసూళ్లు ఇవే!
- ఈ నెల 13వ తేదీన విడుదలైన 'కార్తికేయ 2'
- తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన థియేటర్లు
- హిందీలోను పెరిగిన జోరు
- నిఖిల్ - అనుపమలకు దక్కిన హిట్
ఈ సినిమా విడుదలైన తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35.1 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా చాలా తక్కువ థియేటర్లలో మొదలైంది. మూడో రోజుకే ఈ సినిమా అక్కడ 700 థియేటర్స్ ను దక్కించుకోగలిగింది. ఇక్కడ కూడా థియేటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
చాలా గ్యాప్ తరువాత తన నుంచి వచ్చిన ఈ సినిమా హిట్ కావడం పట్ల నిఖిల్ హ్యాపీగా ఉన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ కి దక్కిన హిట్ కూడా ఇదే. అందువలన ఆమె కూడా ఖుషీగా ఉంది. తెలుగులో 25 వ తేదీవరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ లైన్లో లేకపోవడం వలన, అప్పటివరకూ 'కార్తికేయ 2' జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.