'రాకెట్రీ' నష్టాలతో ఇంటిని అమ్ముకున్నారనే వార్తలపై మాధవన్ స్పందన
- ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా 'రాకెట్రీ' చిత్రం
- తమ సినిమాకు గర్వపడే స్థాయిలో లాభాలు వచ్చాయన్న మాధవన్
- ఇప్పటికీ తాను తన ఇంట్లోనేే ఉన్నానని స్పష్టీకరణ
ఈ నేపథ్యంలో మాధవన్ స్పందిస్తూ... ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాను తన ఇంటిని కానీ, మరేదాన్ని కానీ కోల్పోలేదని అన్నారు. మరో విషయం ఏమిటంటే... 'రాకెట్రీ' సినిమాలో భాగస్వాములు అయిన వారందరూ ఈ ఏడాది మరింత ఎక్కువ ఆదాయపు పన్ను కట్టబోతున్నారని చెప్పారు. దేవుడి దయవల్ల తామంతా కలిసి ఒక మంచి చిత్రాన్ని తీశామని... గర్వించే స్థాయిలో లాభాలను పొందామని తెలిపారు. తన ఇల్లు తనకు చాలా ఇష్టమని... ఇప్పటికీ ఆ ఇంట్లోనో ఉన్నానని చెప్పారు.