కాలేజీ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటూ పోలీసులకు దొరికిపోయా: నాగచైతన్య
- కారు బ్యాక్ సీట్లో ముద్దు పెట్టుకుంటూ దొరికిపోయానన్న చైతూ
- ఆ పని చేయడం తనకు తప్పు అనిపించలేదని వెల్లడి
- ఈ విషయం చెప్పడానికి సిగ్గు పడటం లేదని వ్యాఖ్య
తాను కాలేజీలో చదివే రోజుల్లో కారు బ్యాక్ సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు దొరికిపోయానని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గు పడటం లేదని... ఆ పని చేయడం తనకు తప్పు అనిపించలేదని అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందడంలో విఫలమైంది. అయితే, చైతూకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.