సదా, ఆర్యన్ రాజేశ్ ల 'హలో వరల్డ్'... జీ5 ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్
- ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్
- హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
- హాజరైన విష్వక్సేన్, నేహా శెట్టి
- ట్రైలర్ రిలీజ్ చేసిన హరీశ్ శంకర్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదల, జీ5 భాగస్వామ్యంతో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు శివసాయి వర్ధన్ జలదంకి దర్శకుడు. కాగా 'హలో వరల్డ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని టి. హబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరో హీరో విష్వక్సేన్, హీరోయిన్ నేహా శెట్టి మరియు జీ5 టీమ్ మెంబర్స్ హాజరయ్యారు.