కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్
- ఆయన పుట్టుకతో ముస్లిం కాదని తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ
- హిందూ మతం నుంచి ముస్లింకు మారలేదని వెల్లడి
- సత్యమేవ జయతే అని ట్వీట్ చేసిన వాంఖడే
ఈ విషయం వెల్లడైన వెంటనే వాంఖడే స్పందించారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ‘నా జీవితమంతా నేను సమాజ సేవ కోసం పనిచేశాను. కానీ కొందరు నన్ను ఇబ్బంది పెట్టారు. నాతో పాటు కుటుంబం, చనిపోయిన తల్లిని కూడా విడిచిపెట్టకపోవడం నన్ను బాధపెట్టింది’ అని పేర్కొన్నారు. కాగా, సమీర్ వాంఖడే కులం సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేసిన మహారాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ తదితదులు తమ వాదనకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని నిజ నిర్థారణ కమిటీ తెలిపింది.
గతేడాది వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ మాలిక్ అల్లుడు సమీర్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. మాలిక్ క్యాబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అరెస్టు జరగడంతో తన కులం విషయాన్ని లేవనెత్తారని వాంఖడే ఆరోపించారు. కాగా, ఇదే కేసులో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను కూడా సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం అరెస్టు చేసింది. దాంతో, వాంఖడే పేరు అప్పట్లో మార్మోగింది.