మనో నిబ్బరం కోల్పోవద్దు.. జీవన్ రెడ్డికి కేసీఆర్ సూచన
- ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- హత్యాయత్నం గురించి ఆరా తీసిన కేసీఆర్
- ప్రగతి భవన్‌కు పిలిపించి, జీవన్ రెడ్డికి ధైర్యం చెప్పిన కేసీఆర్
ఈ సందర్భంగా మనో నిబ్బరం కోల్పోవద్దంటూ జీవన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. తన భార్యకు సర్పంచ్ పదవి ఇప్పించలేదన్న కారణంతో టీఆర్ఎస్‌కు చెందిన ఓ గ్రామ స్థాయి నేత... జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే తనను హత్య చేసేందుకు నిందితుడు తన ఇంటికి వచ్చిన సమయంలో జీవన్ రెడ్డి మేల్కొని ఉండటంతో ఆ ప్రమాదం నుంచి జీవన్ రెడ్డి తప్పించుకున్నారు.