దసరా బరిలో 'స్వాతిముత్యం'
- హీరోగా బెల్లంకొండ గణేశ్ ఎంట్రీ
- 'స్వాతిముత్యం'గా ప్రేక్షకుల ముందుకు
- కథానాయికగా వర్ష బొల్లమ్మ
- అక్టోబర్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ మధ్య ఒక రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు .. కాకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవని వాయిదా వేశారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 'దసరా' పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీనివాస్ మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. 'ఛత్రపతి' రీమేక్ తో శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయమవుతుండగా, ఆయన తమ్ముడు టాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం.
.