టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం
- ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ఆర్టీసీ
- 75 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణం
- టీ-24 టికెట్‌ను రూ.75కే విక్రయించనున్న ఆర్టీసీ
- మరెన్నో ఆఫర్లు
అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోనూ రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.