ఆ విషయాలు తెలిస్తే నిత్యా మీనన్‌తో ప్రేమలో పడే వాడిని కాదంటున్న సంతోష్ వర్కీ
- ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ప్రచారం చేసిన సంతోష్
- వర్కీ కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నాడని చెప్పిన నిత్యా మీనన్
- పోలీసు కేసు పెట్టకుండా క్షమించి వదిలేశానన్న నటి
నిత్యా మీనన్ చేసిన ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. 30కి పైగా నంబర్ల నుంచి కాల్ చేసి చిత్రహింసలకు గురిచేశానని నిత్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు. ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో జనాలు ఊహించుకో వాలన్నాడు. నిత్యా మీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయిందని ఆమె తల్లి చెబితే.. జరగలేదని ఆమె తండ్రి తనకు చెప్పారన్నాడు. దాంతో, తాను చాలా కంగారు పడ్డానని తెలిపాడు. వాళ్లు తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టబోతున్నారని తెలిసిందన్నాడు. నిత్యా గురించి ఈ విషయాలు తెలిసి ఉంటే నేను ఆమెతో ప్రేమలో పడి తన చుట్టూ తిరిగేవాడిని కాదన్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా.. తన పని తాను చేసుకుంటున్నానని తెలిపాడు.