ఎంపీ గోరంట్ల మాదిరే ఏపీ మంత్రి ప్రవర్తన... వీడియో విడుదల చేస్తానంటున్న జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు
- మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ ఎంపీ గోరంట్లపై ఆరోపణలు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
- ఎంపీ మాదిరే ఓ మంత్రి కూడా వ్యవహరించారంటున్న శ్రవణ్ కుమార్
ఇలాంటి తరుణంలో ఎంపీ గోరంట్ల మాధవ్ మాదిరే వైసీపీకి చెందిన మరో మంత్రి కూడా వ్యవహరించారని జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఏపీ మంత్రికి సంబంధించిన సదరు వీడియోను త్వరలోనే బయటపెడతానని, సదరు బాధితులు తనను సంప్రదిస్తున్నారనీ శ్రవణ్ వెల్లడించారు.