యంగ్ డైరెక్టర్ తో రాజశేఖర్ మూవీ?
- 'గరుడ వేగ' తో హిట్ కొట్టిన రాజశేఖర్
- కలిసిరాని 'కల్కి' .. 'శేఖర్' సినిమాలు
- పవన్ సాధినేనికి ఓకే చెప్పిన రాజశేఖర్
- నిర్మాతగా మార్కాపురం శివకుమార్
గతంలో రాజశేఖర్ బర్త్ డే రోజున మూడు ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశారు. వాటిలో ఒక్క 'శేఖర్' మాత్రమే థియేటర్లకు వచ్చింది. మిగతా రెండు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వాటికి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు .. వినిపించడం లేదు. రాజశేఖర్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ సాధినేని నుంచి ఇంతకుముందు 'ప్రేమ ఇష్క్ కాదల్' .. 'సావిత్రి' అనే సినిమాలు వచ్చాయిగానీ, ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రాజశేఖర్ తో ఆయన చేయనున్న సినిమాకి, మార్కాపురం శివకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.