పచ్చగడ్డి కోతల్లో టీడీపీ ఎమ్మెల్యేలు... వీడియో ఇదిగో
- నిమ్మలకు తోడైన రామరాజు
- ఉండి పరిధిలో పచ్చ గడ్డి కోతల్లో పాలుపంచుకున్న వైనం
- వీడియోను పోస్ట్ చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే
ఇటీవలి వరదలకు గోదావరి పరీవాహ ప్రాంతంలోని పాలకొల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నిమ్మల... ఆ తర్వాత ఆయా గ్రామాల్లో పశువులకు గ్రాసం సేకరణపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో ఉండి పరిధిలో పచ్చి గడ్డి ఉందని తెలుసుకున్న ఆయన.. పాలకొల్లు ముంపు ప్రాంతాల్లోని పశువులకు గ్రాసం అందజేయడంలో సహకరించాలని సహచర ఎమ్మెల్యే రామరాజును కోరారు. నిమ్మల కోరిక మేరకు ట్రాక్టర్ల నిండా పశుగ్రాసాన్ని రామరాజు పాలకొల్లుకు పంపారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఉండి పరిధిలో పచ్చి గడ్డి కోతల్లో పాలుపంచుకున్నారు. ఈ వీడియోను రామానాయుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.