తెలుగు సినీ పరిశ్రమపై జయసుధ సంచలన వ్యాఖ్యలు
- తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు
- ముంబై నుంచి వచ్చే అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు
- పద్మశ్రీ పురస్కారాలకు మేము పనికిరామా?
ఎప్పుడైనా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని జయసుధ తెలిపారు. హీరోల్లో డామినేషన్ ఉండదని, వారి పక్కన ఉన్న వాళ్లతోనే ఇబ్బంది అని చెప్పారు. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని... ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్ లో అయితే కనీసం ఫ్లవర్ బొకే అయినే పంపించేవారని... ఇక్కడ అది కూడా లేదని విమర్శించారు. అదే హీరో అయితే ఎక్కడా లేని హడావుడి చేసేవారని చెప్పారు.