మళ్లీ జట్టుకట్టిన హరీశ్ శంకర్, అల్లు అర్జున్.. !
- బన్నీ యాడ్ ఫిల్మ్ కు హరీశ్ దర్శకత్వం
- థాయ్ లాండ్ లో చిత్రీకరణ
- త్వరలోనే విడుదల కానున్న యాడ్
సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా బన్నీ దూసుకెళ్తున్నాడు. ప్రముఖ బ్రాండ్లకు తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇదివరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.