లారెన్స్ సరసన ఐదుగురు హీరోయిన్ లు .. అసలు 'చంద్రముఖి' ఎవరు?
- లారెన్స్ హీరోగా రూపొందుతున్న 'చంద్రముఖి 2
- దర్శకత్వం వహిస్తున్న పి. వాసు
- మైసూర్ లో జరుగుతున్న షూటింగ్
- సంగీత దర్శకుడిగా కీరవాణి
ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఆ జాబితాలో లక్ష్మి మీనన్ .. మంజిమా మోహన్ .. మహిమ నంబియార్ .. సృష్టి దాంగే .. సుభిక్ష కృష్ణన్ పేర్లు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అంతా షూటింగులో జాయిన్ అయ్యారు.
అయితే ఈ ఐదుగురిలో అసలు 'చంద్రముఖి' ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మేకర్స్ ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.