'కార్తికేయ 2' నుంచి మరో ట్రైలర్ రెడీ!
- చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2'
- నిఖిల్ జోడీకట్టిన అనుపమ పరమేశ్వరన్
- సంగీత దర్శకుడిగా కాలభైరవ
- ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల
అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా నుంచి ఇంతకుముందు ఒక ట్రైలర్ ను వదిలారు. ఆ తరువాత విడుదల వాయిదా పడటం వలన గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు నిఖిల్ చెప్పాడు. అతి త్వరలో మరో ట్రైలర్ పలకరించనుందనీ .. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అన్నాడు.
కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించింది. కెరియర్ పరంగా కొంతకాలంగా వెనుకబడిపోయిన అనుపమ, ఈ సినిమాపైనే ఆశలుపెట్టుకుంది. ఆగస్టు 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, అంతకుమించి అన్నట్టుగా ఉంటుందేమో చూడాలి.