'సీతా రామం' నుంచి ట్రైలర్ రిలీజ్
- విభిన్నమైన ప్రేమకథగా 'సీతారామం'
- దుల్కర్ జోడిగా మృణాళ్ ఠాకూర్
- కీలకమైన పాత్రలో కనిపించనున్న రష్మిక
- ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కథలో కొంతభాగం 1960లలో నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. సుమంత్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.