ఆయన నా భర్త కాదు.. మాజీ భర్త: సమంత
- కరణ్ జొహార్ షోలో సమంత సంచలన వ్యాఖ్యలు
- చైతూతో స్నేహపూర్వక సంబంధాలు లేవన్న సామ్
- రూ. 250 కోట్ల భరణం తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని వ్యాఖ్య
ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కరణ్ అడిగితే... ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, ఆ గదిలో కత్తులు వంటి వాటిని దాచేయాలని చెప్పింది. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో చెప్పలేమని వ్యాఖ్యానించింది. విడాకుల వల్ల తాను అప్సెట్ కాలేదని తెలిపింది. విడాకుల తర్వాత తాను 250 కోట్ల భరణం తీసుకున్నానని ప్రచారం చేశారని... అది నిజం కాదని స్పష్టం చేసింది.