మంచు సిస్టర్స్ వస్తున్నారు!
- మోహన్ బాబు కుటుంబం నుంచి పరిశ్రమలోకి మూడో తరం
- జిన్నా సిమిమాతో మంచు విష్ణు కూతుళ్లు అరియాన, వివియాన తెరంగేట్రం
- ప్రత్యేక పాటలో నటించిన మంచు వారసులు
విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘జిన్నా’ చిత్రంలోని ఓ పాటను కలిసి పాడడంతో పాటు ఇద్దరూ నటించారు. స్నేహం గొప్పతనం చాటేలా ఉండే ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. తన ఇద్దరు కూతుళ్లు యాక్టర్స్ అవ్వాలనేది తన కోరిక అని మంచు విష్ణు చెప్పాడు. ఆ ప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీస్సులు, అభినందనలు కావాలని విష్ణు కోరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ లేఖ కూడా షేర్ చేశాడు.
‘జిన్నా’ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా.. ప్రేమ్ రక్షిత్ నృత్యాలు కంపోజ్ చేస్తున్నారు.