మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెపుతున్నా: కిచ్చా సుదీప్
- ఈ నెల 28న విడుదలవుతున్న సుదీప్ తాజా చిత్రం 'విక్రాంత్ రోణ'
- ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్లు పెట్టాల్సిన వైనం
- అనారోగ్యం వల్ల ప్రెస్ మీట్లు రద్దు చేశామన్న సుదీప్
సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్స్ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం వల్ల ప్రయాణాలు చేయలేకపోతున్నానని... అందుకే ఈ రోజు జరగాల్సిన ప్రెస్ మీట్స్ రద్దు చేస్తున్నామని చెప్పారు. కోలుకున్న వెంటనే ప్రెస్ మీట్స్ నిర్వహిస్తామని... త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు.