రజనీకాంత్ సూచనలు పాటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది: దర్శకుడు కేఎస్ రవికుమార్
- రజనీకాంత్-కేఎస్ రవికుమార్ కాంబోలో లింగ
- 2014లో వచ్చిన చిత్రం.. బాక్సాఫీసు వద్ద బోల్తా
- రషెస్ చూసి రజనీ అసంతృప్తి చెందారన్న రవికుమార్
- బెలూన్ ఫైట్ ముందు ప్లాన్ చేసుకున్నది కాదని వివరణ
రజనీకాంత్ చేసిన సూచనలే సినిమాను దెబ్బతీశాయని వివరించారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్న సమయంలో రజనీ రషెస్ చూశారని, అయితే అందులో తాను ఆశించిన అంశాలు లేవని ఆయన అసంతృప్తికి గురయ్యారని రవికుమార్ వెల్లడించారు. దాంతో ఆయన పలు సూచనలు చేశారని చెప్పారు.
క్లైమాక్స్ లో వచ్చిన బెలూన్ ఫైట్ ను తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని, చివర్లో హడావుడిగా పెట్టాల్సి వచ్చిందని వివరించారు. అంతేకాదు, వేగంగా షూటింగ్ పూర్తిచేసి రజనీకాంత్ పుట్టినరోజు నాడు సినిమా రిలీజ్ చేశామని తెలిపారు. దాంతో అవుట్ పుట్ సరిగా రాక సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచిందని కేఎస్ రవికుమార్ వివరించారు.