మహేశ్ మూవీలో ఆ పాత్రను అయిష్టంగానే చేశాను: ప్రకాశ్ రాజ్
- 'సరిలేరు నీకెవ్వరు'లో విలన్ పాత్ర పట్ల ప్రకాశ్ రాజ్ అసంతృప్తి
- కొన్ని సార్లు అలాంటి పాత్రలు చేయవలసి వస్తుందంటూ వ్యాఖ్య
- 'మేజర్'లో పాత్ర సంతృప్తిని ఇచ్చిందంటూ వెల్లడి
ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రలలో ఒకటి 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో చేశాను. ఆ సినిమాలో అబద్ధాలాడే ఒక రాజకీయనాయకుడి పాత్రను అయిష్టంగానే చేశాను. కొన్ని సార్లు మన నిర్ణయాలతో .. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటుంది.
మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. నా కెరియర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి" అని చెప్పుకొచ్చారు.