థియేటర్లకు వెళ్లి సందడి చేసిన సాయి పల్లవి
- చెన్నై, హైదరాబాద్ లోని పలు థియేటర్ల సందర్శన
- అభిమానులతో సరదా ముచ్చట్లు
- ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్
పలుచోట్ల అభిమానులు ఈలలు వేస్తూ సాయి పల్లవికి స్వాగతం పలికారు. ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కూడా ఉన్నారు. చిన్నారులపై లైంగిక అంశాన్ని కథాంశంగా ఎంపిక చేసుకుని సామాజిక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడితోపాటు నటి సాయి పల్లవిని అభిమానులు అభినందించారు. తమిళ నటుడు సూర్య ఇప్పటికే ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత గొప్పగా రచించి, గొప్పగా రూపొందించిన సినిమాగా ఇది గుర్తుండిపోతుందన్నారు.