భీమవరంలో అల్లూరి విగ్రహానికి పవన్ నివాళి... వీడియో ఇదిగో
- జనవాణి కోసం భీమవరం వెళ్లిన పవన్
- ఈ నెల 4న భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ
- ప్రధాని మోదీ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా హాజరుకాని పవన్
కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా భీమవరంలో స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామారాజుకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ పవన్ కల్యాణ్ పలు కారణాల వల్ల హాజరు కాలేదు. తాజాగా తన భీమవరం పర్యటనలో ఆయన అల్లూరి విగ్రహానికి నివాళి అర్పించారు.