మహారాష్ట్రలో పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గింపు
- మహారాష్ట్రలో ఇంధన ధరలు తగ్గించిన కొత్త సీఎం షిండే
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటిదాకా మహారాష్ట్రలోనే ఎక్కువ రేట్లు
- తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట
ఇతర నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, గువాహటిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24, గువాహటిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.