బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఇన్ఫీ మూర్తి అల్లుడు!... తొలి రౌండ్ ఓట్లలో మెజారిటీ సునాక్‌దే!
- బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా
- కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ మొదలు
- కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన నేతకే ప్రధాని పీఠం
- తొలి రౌండ్ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు సాధించిన రిషి సునాక్
- ఓటింగ్ నుంచి ఇద్దరు అభ్యర్థుల అవుట్
బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసిన తొలి రౌండ్ ఓట్లలో రిషి సునాక్‌కు అత్యధికంగా 8 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవి రేసులో రిషి సునాక్‌తో పాటు బరిలో నిలిచిన మోర్డాంట్‌కు 67 ఓట్లు రాగా.. ట్రస్‌కు 50 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న నధిమ్ జహవి, మాజీ మంత్రి జెరెమీ హంట్‌లు ఏకంగా రేసు నుంచే తొలగిపోయారు. ఫలితంగా బరిలో నిలిచిన వారిలో రిషి సునాక్‌కు అత్యధిక ఓట్లు దక్కడంతో ప్రధాని పదవి రేసులో అందరికంటే ముందు ఆయనే నిలిచారు.