టీడీపీ వెబ్‌సైట్స్ జాబితాను వెల్లడిస్తూ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ట్వీట్
- అన్ని సైట్లూ ఒకే ఐపీ అడ్రెస్ నుంచి పనిచేస్తున్నాయన్న గోపిరెడ్డి
- అన్నీ రాబిన్ శర్మ పేరిటే రిజిస్టర్ అయి ఉన్నాయని వెల్లడి
- 'అరెస్ట్ రాబిన్ శర్మ' అంటూ హ్యాష్ ట్యాగ్ తగిలించిన వైసీపీ ఎమ్మెల్యే
టీడీపీ కోసం పనిచేస్తున్న ఈ వెబ్ సైట్లన్నీ ఒకే ఐపీ అడ్రెస్ నుంచి నడుస్తున్నాయని గోపిరెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సైట్లన్నీ కూడా టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ పేరిటే రిజిస్టర్ అయి ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ వెబ్ సైట్ల జాబితాతో కూడిన తన ట్వీట్‌కు అరెస్ట్ రాబిన్ శర్మ, ఫ్రస్ట్రేటెడ్ టీడీపీ పేరిట హ్యాష్ ట్యాగ్‌లను కూడా గోపిరెడ్డి జత చేశారు.