'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!
- రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ'
- కథానాయికలుగా దివ్యాన్ష - రజీషా
- ఈ నెల 16వ తేదీన ట్రైలర్ రిలీజ్
- 29వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. పవిత్ర లోకేశ్ .. తనికెళ్ల భరణి నటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.