భారత సైనికుడికి సెల్యూట్ చేసిన దలైలామా!... వీడియో ఇదిగో!
- తనకు వీడ్కోలు పలుకుతున్న భారత సైనికుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన దలైలామా
- దలైలామా చేతిని ముద్దాడిన భారత సైనికుడు
- వీడియోను పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ
బౌద్ధ మత గురువు దలైలామా తన పర్యటనలో భాగంగా బయలుదేరుతూ తనకు వీడ్కోలు పలికేందుకు నిలుచున్న భారత సైనికుడొకరికి సెల్యూట్ చేశారు. అంతేకాకుండా తనకు సెల్యూట్ చేస్తూ నిలుచున్న ఆ భారత సైనికుడిని తన వద్దకు రమ్మని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దలైలామా పిలుపుతో ఆయన వద్దకు వెళ్లిన భారత సైనికుడు ఆయన చేతిని ముద్దాడి... దలైలామాపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.