వైఎస్సార్ కు జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు.. వీడియో ఇదిగో!
- నేడు వైఎస్సార్ 73వ జయంతి
- ఇడుపులపాయలో కుటుంబ సభ్యుల నివాళులు
- ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు
1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన వైఎస్... ఒక్క రూపాయికే వైద్యం చేసి, రూపాయి డాక్టర్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి ఎరుగని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వైఎస్... ఆ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలను చేపట్టారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.