ఈ దర్శకుడు నాకు కాల్ చేసినప్పుడు కుదరదని చెప్పాను: వేణు తొట్టెంపూడి
- 'దమ్ము' తరువాత సినిమాలకి దూరమైన వేణు
- పదేళ్ల తరువాత రవితేజ సినిమాతో రీ ఎంట్రీ
- పోలీసాఫీసర్ పాత్రలో నటించిన వేణు
- ఈ 29న రిలీజ్ అవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ .. " సినిమాల పట్ల నాకున్న ప్రేమ ఎంత మాత్రం తగ్గలేదు. కాకపోతే కొన్ని కారణాల వలన సినిమాలను పక్కన పెట్టవలసి వచ్చింది. ఈ సినిమా దర్శకుడు శరత్ మండవ నాకు కాల్ చేసినప్పుడు కూడా కుదరదనే చెప్పాను. అయినా వదలకుండా వచ్చి నన్ను కలిశాడు.
ఈ సినిమా కథ ఏమిటి? అందులో నా పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ పాత్రకి గాను నన్నే అనుకోవడానికి కారణం ఏమిటి? అనేది చెప్పాడు. దాంతో నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవలసి వచ్చింది. రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆయన ఒక పవర్ హౌస్ లాంటి హీరో. సెట్లో తనతో పాటు అందరూ ఎనర్జీతో ఉండేలా చేయడం ఆయన ప్రత్యేకత" అంటూ చెప్పుకొచ్చాడు.