టెస్టుల్లో అత్యుత్తమ ఆటగాడు ఇతడే: ఇంగ్లండ్ ఆటగాడిపై సెహ్వాగ్ ప్రశంసల జల్లు
- బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ విజయం
- సెంచరీతో రాణించిన రూట్
- సిరీస్ లో 4 సెంచరీలు అద్భుతమన్న సెహ్వాగ్
ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్ మన్ ఎవరంటే రూట్ పేరే చెబుతానని వెల్లడించాడు. సిరీస్ లో నాలుగు సెంచరీలు సాధించడం అద్భుతమని కొనియాడాడు. రూట్ ఓ పరుగుల యంత్రం అంటూ సెహ్వాగ్ అభివర్ణించాడు.