మోదీ, జగన్‌లతో సెల్ఫీ తీసుకున్న రోజా!... భీమవరం వేదికపై ఏపీ మంత్రి సందడి!
- అల్లూరి విగ్రహావిష్కరణకు భీమవరం వచ్చిన మోదీ
- జగన్, మోదీలను పక్కపక్కనే నిలబెట్టి సెల్ఫీ తీసుకున్న రోజా
- రోజా విజ్ఞప్తితో రెండో సారి కూడా సెల్ఫీకి పోజిచ్చిన మోదీ
ఓ దశలో రోజా సెల్ఫీ తీయడం అయిపోయిందని భావించిన మోదీ పక్కకు వెళ్లిపోయారు. అయినా కూడా రోజా ఆయనను అనుసరించి మరోమారు ఆయనను సెల్ఫీకి పోజిచ్చేలా చేశారు. చివరకు వారిద్దరితో కలిసి సెల్ఫీ తీసుకున్న రోజా సంతోషంగా కనిపించారు. ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలో పనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన రోజా.. మన్యం వీరుడి విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు.
.