విక్రమ్ సినిమాను ఆకాశానికెత్తేసిన మహేశ్ బాబు
- కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రమ్
- దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న చిత్రం
- కొత్త తరహా సినిమాలకు నాందీ పలికిందన్న మహేశ్ బాబు
శనివారం ఈ చిత్రంపై స్పందించిన మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని కొనియాడాడు. కొత్త తరహా సినిమాకు ఈ సినిమా నాందీ పలికిందని మహేశ్ బాబు కీర్తించాడు. ఈ సినిమా కథపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మిమ్మల్ని కలుస్తానని కనకరాజ్‌కు తెలిపారు. అత్యద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారంటూ మహేశ్ కీర్తించాడు.