బ్రాడ్ పేరిట మరో చెత్త రికార్డు... చితకబాదిన బుమ్రా... వీడియో ఇదిగో!
- బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
- ధాటిగా ఆడిన బుమ్రా
- ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్న బ్రాడ్
- ఫోర్లు, సిక్సులు బాదిన బుమ్రా
ఈ ఓవర్లో తొలి బంతికి బుమ్రా 4 కొట్టగా, రెండో బంతికి వైడ్, నాలుగు బైస్ తో కలిపి 5 రన్స్ లభించాయి. ఆ తర్వాత మూడో బంతిని బ్రాడ్ నోబాల్ వేయగా, బుమ్రా దాన్ని సిక్స్ గా మలిచాడు. బుమ్రా ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇక చివరి బంతికి సింగిల్ రన్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తంగా 35 పరుగులు లభించాయి.
గతంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా, ఆస్ట్రేలియా ఆటగాడు బెయిలీ, సఫారీ ఆటగాడు కేశవ్ మహరాజ్ ల పేరిట ఉంది. లారా 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. బెయిలీ 2013లో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. కేశవ్ మహరాజ్ 2020లో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ బౌలింగ్ లో 28 పరుగులు నమోదు చేశాడు.