ఎల్లకాలం నేనే నాయకుడిని అనుకోవడం మంచిది కాదు: బొత్స సత్యనారాయణ
- అదృష్ణం ఉంటే ఎవరైనా నాయకుడు కావచ్చన్న బొత్స
- టీడీపీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని కామెంట్
- 1998 డీఎస్సీ ఉద్యోగులకు మళ్లీ ట్రైనింగ్ ఇస్తామన్న మంత్రి
టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున గురించి మాట్లాడుతూ, వయసులో చిన్నవాడివి అవగాహన లేకుండా మాట్లాడొద్దని బొత్స సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి మీ అమ్మగారు ఏం చేశారో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని చెప్పారు. 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నానని... వారి వయసులు పెరిగిపోయాయని అన్నారు. ఈ వయసులో విద్యార్థులకు వారు ఏం బోధిస్తారు? అందుకే వారికి ఇప్పుడు మళ్లీ ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పారు.