నేను తింటున్నది కూడా ఉప్పూ కారమే.. ఇక నా వల్ల కాదు: సొంత పార్టీ నేతలకు బాలినేని హెచ్చరిక
- ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న బాలినేని
- వారెవరో తనకు తెలుసని, వదిలిపెట్టబోనని హెచ్చరిక
- పద్ధతి మార్చుకోకుంటే కాళ్లు విరగ్గొడతానన్న ఎమ్మెల్యే
తమ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మునిసిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనుతో చేతులు కలిపి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేతులు కలిపిన వారు ఎవరో తనకు తెలుసని, వారు ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని, ఇక తన వల్ల కాదని స్పష్టం చేశారు. విషయాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్తానని బాలినేని పేర్కొన్నారు.