రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
- రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
- వచ్చేనెల 14వ తేదీన విడుదల
- తదుపరి సినిమా బోయపాటితో
- లైన్లో నే ఉన్న హరీశ్ శంకర్
ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చాలా రోజుల క్రితమే మొదలైపోయాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రామ్ చేస్తున్న ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది. ఆ రేంజ్ బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుండగానే రామ్ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆ డైరెక్టర్ ఎవరివో కాదు .. హరీశ్ శంకర్. ఆయన వినిపించిన కథ రామ్ కి బాగా నచ్చేసిందని చెబుతున్నారు. మరి బోయపాటి మూవీ తరువాత రామ్ ఈ ప్రాజెక్టు చేస్తాడా? దానితో పాటు ఇది కూడా కానిచ్చేస్తాడా? అనేది చూడాలి.