28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి
- తొమ్మిదో విడత రైతు బంధు విడుదలకు ఏర్పాట్లు
- పథకం కింద ఇప్పటివరకు రైతులకు రూ.50,447.33 కోట్లు
- ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి
- 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కృషి
ఆయిల్ పామ్ కు ప్రోత్సాహం
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరికి బదులుగా పత్తి, పప్పు ధాన్యాలు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగడు వంటి నూనె గింజలు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా భారీ స్థాయిలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.