పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ గదిలో నిఘా పరికరం పెట్టేందుకు ప్రయత్నం.. ఉద్యోగి అరెస్టు
- మాజీ ప్రధాని ఇమ్రాన్ హత్యకు కుట్ర చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణ
- భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
- ఈ మధ్యే పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
ప్రధాని పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. దాంతో, ఇస్లామాబాద్, ఇమ్రాన్ నివాస ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పీటీఐకి చెందిన పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ప్రభుత్వంతో సహా అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. ‘మా అధినేత గదిని శుభ్రపరిచే ఉద్యోగికి గూఢచారి పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి డబ్బు ఇచ్చారు. ఇది చాలా హీనమైన చర్య. కొంతమంది సమాచారం కోసం మా మనుషులను బెదిరిస్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవాలి’ అని పీటీఐ నాయకుడు షెహబాజ్ గిల్ అన్నారు.