కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి
- 2014లో వివాహ బంధంతో ఒక్కటైన చిన్మయి-రాహుల్ రవీంద్రన్
- తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ వచ్చి చేరారన్న రాహుల్
- శుభాకాంక్షలతో హోరెత్తుతున్న సోషల్ మీడియా
నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్, ఏమాయ చేశావె, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరి వాడేలే నుంచి ఇటీవల విడుదలైన మేజర్ వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు. ఇక ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. శ్యామ్‌సింగరాయ్ సినిమాలో ఆయన పోషించిన రాహుల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘చి..ల..సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు.