బాహుబలి-2 రికార్డును అధిగమించిన కమలహాసన్ 'విక్రమ్'
- ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విక్రమ్'
- కమల్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రం
- వరల్డ్ వైడ్ రూ.300 కోట్లు రాబట్టిన విక్రమ్
- తమిళనాడులో రెండు వారాల్లో రూ.150 కోట్లు
- తమిళనాట రూ.146 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2
కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్రనటులు నటించిన విక్రమ్ చిత్రం తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రముఖ హీరో సూర్య 'రోలెక్స్' అనే గెస్ట్ రోల్ లో కాసేపు కనువిందు చేశాడు. సూర్య కనిపించేది ఐదు నిమిషాలే అయినా థియేటర్లో విజిల్స్ మోగేలా అతడి పాత్ర ఉందని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.