16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన కేంద్రం.. జులై 1 నుంచే అమల్లోకి
- ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు నిషేధం
- ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు ఆదేశం
- ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదంటూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, దీనిని ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా వాటి లైసెన్సు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు వివరించింది.