నేను ఏ పార్టీలోనూ లేను.. జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు: సినీ నటుడు సుమన్
- తన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి భార్య మొదటి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సుమన్
- వెబ్ సిరీస్‌లలో అశ్లీలత పెరిగిపోయిందని ఆవేదన
- సెన్సార్ బోర్డు జోక్యం చేసుకోవాలన్న నటుడు
- జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదన్న సుమన్
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు అవకాశాలు ఉన్నాయన్నారు. లొకేషన్లు, పోలీసు బందోబస్తు, త్వరితగతిన అనుమతి మంజూరు వంటి సదుపాయాలు కల్పిస్తే ఇక్కడ సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించానని, అపాయింట్‌మెంట్ కోరితే దొరకలేదని సుమన్ తెలిపారు.