ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం... గౌతమ్ గంభీర్ ట్వీట్ పై స్వరా భాస్కర్ స్పందన
- మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా నిరసనలు
- లౌకిక ఉదారవాదులు మౌనం వీడడంలేదన్న గంభీర్
గంభీర్ వ్యాఖ్యలను స్వరా భాస్కర్ తప్పుబట్టారు. ఇలాంటి వారికి బుల్డోజర్ల శబ్దం వినిపించడం లేదేమో! అంటూ వ్యాఖ్యానించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై యూపీలో ఆందోళనలు చేపట్టినవారి ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేయడాన్ని స్వరా భాస్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఇలా బుల్డోజర్ దాడులు చేపడుతోందని విమర్శలు వస్తుండడం తెలిసిందే.