హుస్సేన్ సాగర్ తీరాన కాంగ్రెస్ హోరు... రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ ఆందోళన
- ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఈడీ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
- హుస్సేన్ సాగర్ మీదుగా టీపీసీసీ ర్యాలీ
- ర్యాలీలో జన వాహిని అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాయి. ఈ ర్యాలీ హుస్సేన్ సాగర్ మీదుగా సాగగా... ఆ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. అక్కడ ఓ జనసంద్రమే కనిపించింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి... ర్యాలీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ దానికి 'సాగర తీరాన జన వాహిని... ప్రతిధ్వని' అంటూ ఓ కామెంట్ జత చేశారు. అంతేకాకుండా సత్యమేవ జయతే అన్న క్యాప్షన్‌ను కూడా తన ట్వీట్‌కు ఆయన జత చేశారు.