పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన మహేశ్ బాబు, అడివి శేష్
- ఇటీవల విడుదలైన మేజర్
- విడుదలైన ప్రతి చోట హిట్ టాక్
- చిత్రబృందాన్ని అభినందిస్తూ పవన్ కల్యాణ్ ప్రకటన
- కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ బాబు
- ధన్యుడ్ని అంటూ అడివి శేష్ ట్వీట్
అడివి శేష్ కూడా ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. "డియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... నా హృదయం ఆనందంతో నిండిపోయింది. టూర్ బిజీగా ఉండేసరికి మీకు మేజర్ సినిమా చూసే టైమ్ ఉంటుందా అని అనుకున్నా. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన లేఖ నిజంగా మనసును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను నా సర్వస్వంగా భావిస్తాను. ఆ రోజు పంజా, ఇవాళ మేజర్. మీ అభిమానానికి ధన్యుడ్ని" అంటూ అడివి శేష్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా 2011లో వచ్చిన 'పంజా' చిత్రంలో అడివి శేష్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.