కమల్ ను సన్మానించిన చిరంజీవి .. సందడి చేసిన సల్మాన్!
- తన నివాసంలో పార్టీ ఇచ్చిన చిరంజీవి
- 'విక్రమ్' విజయం నేపథ్యంలో కమల్ ను సన్మానించిన చిరు
- కమల్ ను సన్మానించడం సంతోషంగా ఉందన్న మెగాస్టార్
సినిమా విజయాన్ని అభినందిస్తూ తన ప్రియ మిత్రుడు కమల్ హాసన్ ను సన్మానించడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. కమల్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కనకరాజ్, 'విక్రమ్' సినిమాకు చెందిన ఇతర టీమ్ సభ్యులకు నిన్న రాత్రి తన నివాసంలో పార్టీ ఇచ్చానని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్ 'విక్రమ్' ఒక అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు. నీవు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. మరోవైపు 'కభీ ఈద్ కభీ దీవాలీ' సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.


