తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన కఠారి హేమలత
- 2015లో కఠారి దంపతుల హత్య
- చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఘటన
- ఈ కేసుపై ఇంకా కొనసాగుతున్న విచారణ
- తిరుమలలో సీజేఐని కలిసిన కఠారి హేమలత
- కేసు విచారణ త్వరితగతిన ముగిసేలా చూడాలని వినతి
చిత్తూరు నగరానికి చెందిన కఠారి మోహన్ టీడీపీలో కీలక నేతగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు నగర పాలక సంస్థ చైర్ పర్సన్‌గా ఆయన భార్య కఠారి అనురాథ ఎన్నికయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో అప్పటికే పలు కేసులు నమోదైన కఠారి మోహన్‌కు నగరంలో వర్గ శత్రువుల నుంచి దాడి పొంచి ఉండేది. ఈ క్రమంలో చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో చైర్ పర్సన్ సీటులో కూర్చున్న అనురాధ, ఆమె ముందు కూర్చున్న కఠారి మోహన్‌లను వారి అల్లుడు చింటూ రాయల్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 2015లో జరిగిన ఈ హత్యోదంతంపై విచారణ ఇంకా కొనసాగుతోంది.