ఏపీ ఇంధన శాఖ స్పెషల్ సీఎస్‌గా విజయానంద్ నియామకం
- మొన్నటిదాకా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు
- ఇటీవలే ఆ పదవిలో ముఖేశ్ కుమార్ మీనా నియామకం
- అప్పటి నుంచి వెయిటింగ్‌లోనే ఉన్న విజయానంద్
- తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
అయితే ఐదేళ్లకు మించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఏ ఒక్క అధికారి పని చేయడానికి వీల్లేదన్న నిబంధన మేరకు విజయానంద్‌ను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పదవి నుంచి తప్పించింది. విజయానంద్ స్థానంలో కొత్తగా ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న విజయానంద్‌కు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.